: కేజ్రివాల్ పై పిల్ దాఖలు


జాతీయ జెండాతో పాటు మూడు సింహాల గుర్తు పట్ల దుర్వినియోగానికి పాల్పడతున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రివాల్, ఇతర నేతలు మయాంక్ గాంధీ, అంజలి దమానియాలపై ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. బాంబే హైకోర్టులో రామ్ సముద్రే అనే వ్యక్తి ఈ మేరకు పిల్ వేశారు. ఆమ్ ఆద్మీ వెబ్ సైట్ లో త్రివర్ణ పతాకం, మూడు సింహాల గుర్తును ఉంచడం ద్వారా చట్టాన్ని ఉల్లంఘించారని సముద్రే తన వ్యాజ్యంలో పేర్కొన్నారు. పొలిటికల్ మైలేజి పెంచుకునేందుకే వారు తమ వెబ్ సైట్లో జాతీయ చిహ్నాలను పెట్టుకున్నారని ఆయన విమర్శించారు. ఈ పిల్ పై మార్చి 12 విచారణ జరపనున్నారు.

  • Loading...

More Telugu News