: ప్రజల కోసం పని చేసే వారికే టిక్కెట్లు: కిరణ్
ప్రజల కోసం పని చేసే వారికే తమ పార్టీ నుంచి టిక్కెట్లు కేటాయిస్తామని మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. టిక్కెట్లు అమ్మబోమని, అడ్వాన్స్ బుకింగులు కూడా లేవన్నారు. టిక్కెట్ల కోసం ఇప్పటికే చాలా దరఖాస్తులు వచ్చాయన్నారు. పార్టీ పూర్తి విధివిధానాలను ఈ నెల 12న నిర్వహించే రాజమండ్రి సభలో ప్రకటిస్తానన్నారు. కాగా, ఈ పార్టీకి వ్యవస్థాపక అధ్యక్షుడుగా చుండ్రు శ్రీహరిరావు వ్యవహరిస్తారని ఆయన ప్రకటించారు. ఇక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తానేనని, ఉపాధ్యక్షులుగా సాయి ప్రతాప్, సబ్బంహరి, ఉండవల్లి, శైలజానాథ్, పితాని సత్యనారాయణ, హర్షకుమార్ ఉంటారని చెప్పారు. పార్టీ వ్యూహకర్తగా లగడపాటి వ్యవహరిస్తారని తెలిపారు. పార్టీ కార్యదర్శిగా జి.గంగాధర్ ఉంటారన్నారు.