: పాకిస్థాన్ లోనూ ఆమ్ ఆద్మీ పార్టీ
అరవింద్ కేజ్రీవాల్ అనే ఓ మాజీ ప్రభుత్వ ఉద్యోగి ఆధ్వర్యంలో భారత్ లో పుట్టుకొచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు దాయాది దేశం పాకిస్థాన్ లోనూ నెలకొననుంది. దాని స్ఫూర్తితో పాక్ లోనూ అదే పేరుతో పార్టీని స్థాపించారు. అక్కడి గుజ్రాన్ వాలాకు చెందిన సామాజిక కార్యకర్త అర్సన్-ఉల్-ముల్క్ 'ఆమ్ ఆద్మీ పార్టీ' పేరుతో పాక్ ఎలక్షన్ కమిషన్ వద్ద పేరు నమోదు చేయించారు. ఆప్ ద్వారా మహమ్మద్ అలీ జిన్నా కలలుగన్న విధంగా పాకిస్థాన్ ను మార్చుతానని పార్టీ స్ధాపకుడు ముల్క్ అంటున్నారు. తన కార్యకర్తలతో కలసి పంజాబ్ అసెంబ్లీ ఎదుట వచ్చేవారం నిరాహార దీక్ష చేపడుతున్నట్లు ముల్క్ ప్రకటించాడు.