: రాహుల్ ప్రచారానికి నిధులెక్కడివో చెప్పాలి: మోడీ


బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ నేడు రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు. లోక్ సభ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టిన రాహుల్ కు నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయో వెల్లడించాలని డిమాండ్ చేశారు. బీహార్లోని పూర్ణియా వద్ద ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ, 'షెహజాదా (రాకుమారుడు) దేశవ్యాప్త ఎన్నికల ప్రచారానికి బయల్దేరారు. ఆ ప్రచారానికి నిధులు అంగారక గ్రహం నుంచి వస్తున్నట్టు చెబుతున్నారు. ఆ ప్రచారానికైన ప్రతి రూపాయి ఖర్చుకూ ప్రభుత్వం లెక్క చూపాలి' అని పేర్కొన్నారు.

ఇక, థర్డ్ ఫ్రంట్ పైనా తనదైన శైలిలో వ్యాఖ్యానించారు మోడీ. ప్రధాని పదవి కోసం వెంపర్లాడుతున్న కొందరు నేతలే మూడో ఫ్రంట్ రూపకర్తలని విమర్శించారు. వీరందరూ ఎన్నికల తర్వాత నిద్రపోయి, మరలా ఎన్నికలప్పుడే మేల్కొనే రకాలని ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News