: 'మిస్ ఇండియా ఎర్త్' గా విశాఖ అమ్మాయి


విశాఖ అమ్మాయి ధూళిపాళ శోభిత ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో.. 'మిస్ ఇండియా ఎర్త్' కిరీటాన్ని దక్కించుకుంది. ఈమె ఈ పోటీల్లో మొదటి రన్నరప్ గా నిలిచింది. రాష్ట్రానికి చెందిన 20 ఏళ్ళ శోభిత ప్రస్తుతం ముంబయి హెచ్ ఆర్ కాలేజీలో డిగ్రీ చదువుతోంది. శోభిత చివరివరకూ పోటీలో నిలిచి సహపోటీదారులకు గట్టిపోటినిచ్చింది. అయితే ఫైనల్లో కాస్త వెనకబడిన ఈ తెలుగమ్మాయి 'మొదటి రన్నరప్' తో సరిపెట్టుకుంది. 

కాగా, 'ఫెమినా మిస్ ఇండియా-2013' టైటిల్ ను పాటియాలా సుందరాంగి నవనీత్ కౌర్ దిల్లాన్ సొంతం చేసుకుంది. మొత్తం 23 మంది భామల్లో 10 మంది ఫైనల్స్ కు చేరుకున్నారు. వీరందరిని వెనక్కునెట్టిన నవనీత్ కౌర్ 'మిస్ ఇండియా' కిరీటాన్ని దక్కించుకుంది. ఇక రెండవ రన్నరప్ గా జోయా అఫ్రోజ్ 'మిస్ ఇండియా ఇంటర్నేషనల్' కిరీటాన్ని దక్కించుకుంది. 

'ఫెమినా మిస్ ఇండియా' పోటీలు మొదలై 50 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ముంబయి లోని యశ్ రాజ్ స్టూడియోలో  ఫైనల్స్ ను అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్, ప్రియాంక చోప్రాల డాన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చాలా కాలం తర్వాత స్టేజ్ ప్రదర్శన ఇచ్చిన ఐష్... నల్లటి డ్రెస్ లో ఆకర్షణీయంగా కనిపించింది. 

దర్శకనిర్మాత కరణ్ జోహార్, నటుడు జాన్ అబ్రహామ్, క్రికెటర్ యువరాజ్ సింగ్, ఫ్యాషన్ డిజైనర్ రీతూ కుమార్, ఆసిన్, చిత్రాంగదా సింగ్ ఈ పోటీకి న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. మరోవైపు మిస్ ఇండియా పోటీదారులతో గాయకుడు సోను నిగమ్ ఆటపాట అందరినీ ఆకట్టుకుంది. 

  • Loading...

More Telugu News