: రాజకీయాల్లోకి రావాలనుంది: తారకరత్న
రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నానని, అయితే దానికి ఇంకా సమయం ఉందని సినీ హీరో నందమూరి తారకతర్న చెప్పారు. విజయనగరం జిల్లా సాలూరులో తారకరత్న మీడియాతో మాట్లాడారు. హరికృష్ణకు నందమూరి కుటుంబంతో ఎలాంటి విభేదాలు లేవని ఆయన అన్నారు. త్వరలో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని ఆయన తెలిపారు.
ఫిట్ నెస్ కోసమే తాను సన్నబడ్డానని, సిక్స్ ప్యాక్ కోసం ప్రయత్నిస్తున్నానని తారకరత్న చెప్పారు. అయితే సినిమాల కోసం మాత్రం కాదని తారకరత్న తేల్చి చెప్పారు. తాను నటించిన అలెగ్జాండర్ సినిమా ఈ నెలలో విడుదల అవుతోందని ఆయన తెలిపారు.