: రివర్స్ గేర్లో కారు నడిపి చిక్కుల్లోపడ్డాడు!


ఓ యువకుడు ప్రపంచ రికార్డు కోసం రివర్స్ గేర్లో కారు నడిపి పోలీసుల ఆగ్రహానికి గురయ్యాడు. ఉత్తరాఖండ్ లోని కషీపూర్ లో జరిగిందీ ఘటన. వివరాల్లోకెళితే... మునీర్ అహ్మద్ అనే యువకుడికి ప్రపంచ రికార్డు సాధించాలన్న కోరిక కలిగింది. ఆలోచన వచ్చిందే తడవుగా తన ఇండిగో కారుతో ఏదైనా ఫీట్ చేయాలనుకున్నాడు. ఓ శుభదినాన తన కారును రివర్స్ గేర్లో వేగంగా రోడ్డుపై పరుగులెత్తించాడు. ఇది చూసి ఇతర వాహనదారులు బెంబేలెత్తిపోయారు. విషయం పోలీసుల వరకూ వెళ్ళడంతో వారు అహ్మద్ ఉత్సాహానికి బ్రేకులు వేశారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించావంటూ భారీ చలాన్ ఒకటి రాసి అతని ముఖాన పడేశారు. దీనిపై అహ్మద్ మాట్లాడుతూ, త్వరలోనే ప్రపంచ రికార్డు సాధిస్తానని ధీమా వ్యక్తం చేశాడు.

  • Loading...

More Telugu News