: తెలంగాణ, సీమాంధ్ర కాంగ్రెస్ కు కవల పిల్లలు: జైరాం రమేష్


విభజన జరిగిన తర్వాత తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలపై కేంద్రమంత్రి జైరాం రమేష్ తెగ ప్రేమ చూపిస్తున్నారు. తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలు కాంగ్రెస్ కు కవల పిల్లలని అన్నారు. జూన్ 2న తెలంగాణం ఏర్పడుతుందని, అప్పుడే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని నిజామాబాద్ రోడ్ షోలో ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ, సీమాంధ్రలో లబ్ది పొందేందుకే సుష్మా స్వరాజ్, వెంకయ్యనాయుడు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ రబ్బర్ స్టాంప్ పార్టీ కాదని, ఎవరికీ తలవంచి దండాలు పెట్టదన్నారు.

  • Loading...

More Telugu News