: టి20 వరల్డ్ కప్ కు రిఫరీగా జవగళ్ శ్రీనాథ్


భారత మాజీ క్రికెటర్ జవగళ్ శ్రీనాథ్ టి20 వరల్డ్ కప్ లో రిఫరీగా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. ఈ మేరకు ఐసీసీ నేడు ప్రకటించింది. ఈనెల 16 నుంచి బంగ్లాదేశ్ వేదికగా జరిగే టి20 ప్రపంచకప్ లో శ్రీనాథ్, రంజన్ మదుగళే (శ్రీలంక), రోషన్ మహానామా (శ్రీలంక), డేవిడ్ బూన్ (ఆస్ట్రేలియా) రిఫరీలుగా వ్యవహరిస్తారని ఐసీసీ పేర్కొంది. ఇక, అంపైరింగ్ బాధ్యతల కోసం 11 మందితో జాబితా విడుదల చేసింది. అలీమ్ దార్, కుమార ధర్మసేన, స్టీవ్ డేవిస్, మరాయిస్ ఎరాస్మస్, ఇయాన్ గౌల్డ్, రిచర్డ్ ఇల్లింగ్ వర్త్, రిచర్డ్ కెటిల్ బరో, నిగెల్ లాంగ్, బ్రూస్ ఆక్సెన్ ఫర్డ్, పాల్ రీఫెల్, రాడ్ టకర్ లు టోర్నీలో అంపైర్లుగా వ్యవహరించనున్నారు.

  • Loading...

More Telugu News