: మరో వందేళ్లయినా పోలవరం పూర్తి కాదు: బలరాం నాయక్
పోలవరం ప్రాజెక్టు మరో వందేళ్లయినా పూర్తి కాదని కేంద్రమంత్రి బలరాం నాయక్ అన్నారు. పోలవరం ముంపు గ్రామాలను తెలంగాణలోనే ఉంచాలని... సీమాంధ్రలో కలిపితే ఒప్పుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ రోజు వరంగల్ లో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పొత్తుల కోసం కాంగ్రెస్ పార్టీ వెంపర్లాడటం లేదని... ఎన్నికల్లో ఒంటరిగా గెలిచే సత్తా కాంగ్రెస్ కు ఉందని తెలిపారు.