: ఎన్నికల తర్వాత కొత్త పార్టీపై నిర్ణయం: అళగిరి


డీఎంకే అధినేత కరుణానిధి పెద్ద కుమారుడు అళగిరి కొత్త పార్టీ పెట్టాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ, లోక్ సభ ఎన్నికల తర్వాత కొత్త పార్టీపై ఆలోచిస్తానని చెన్నైలో చెప్పారు. తన కేడర్ తో చర్చించాక వచ్చే రెండు నెలల్లో నిర్ణయం తీసుకుంటానన్నారు. రెండు నెలల కిందట పార్టీకి రెబల్ నేతగా మారి తండ్రి కరుణను ధిక్కరించిన అళగిరిపై క్రమ శిక్షణ చర్యలు తీసుకోవడంతో బహిష్కృత వేటు పడింది. అప్పటినుంచి అళగిరి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు.

  • Loading...

More Telugu News