: తాబేలుకి ముద్దు పెట్టబోయి ఆస్పత్రి పాలయ్యాడు
తెలియని వారిని ముద్దాడితే ఏమవుతుంది... మూతి పగులుతుంది. 32 పళ్లు రాలినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఓ చైనీయుడికి కూడా ఇంచు మించు ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఫుజియాన్ ప్రావిన్స్ కు చెందిన ఓ వ్యక్తి ఒక తాబేలును అడవిలో విడిచి పెడుతూ దానికి ముద్దు పెట్టబోయాడు. అదసలే ప్రమాదకరమైన తాబేలు. చూస్తూ ఊరుకుంటుందా? పెదాలను కొరికేసింది. అంతే అతగాడు ఆస్పత్రి పాలయ్యాడు. దీనికి సంబంధించిన ఫొటోలు చైనా మైక్రో బ్లాగింగ్ సైట్ వీబోలో కూడా దర్శనమిస్తున్నాయి.