: సానియాపై కేసులు కొట్టేసిన ముజఫర్ నగర్ కోర్టు
టెన్నిస్ స్టార్ సానియా మీర్జాపై దాఖలైన మూడు ఫిర్యాదులను ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ కోర్టు కొట్టేసింది. సానియా భారత జాతీయగీతం పట్ల తగినంత గౌరవం ప్రదర్శించలేదని మూడు పిటిషన్లు దాఖలయ్యాయి. 2008, నవంబర్ 8 నుంచి ఈ కేసు విచారణ పెండింగ్ లో ఉంది. అయితే, తాజా విచారణ సందర్భంగా ఫిర్యాదుదారులు కోర్టుకు హాజరు కాకపోవడంతో సానియాపై పిటిషన్లను కొట్టివేస్తున్నట్టు అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ సీతారాం తెలిపారు.