: నీటితో వైన్ తయారీ... అదీ మూడు రోజుల్లోనే...!
అమెరికన్ పరిశోధకులు ఓ కొత్త యంత్రానికి రూపకల్పన చేశారు. నిజంగా ఇది అద్భుత యంత్రమే. ఎందుకంటే, మామూలు పద్ధతుల్లో తయారైన వైన్ సీసాల్లోకి వచ్చేసరికి ఏళ్ళు పడుతుంది. కానీ, ఈ వండర్ మెషీన్ మూడంటే మూడు రోజుల్లో వైన్ తయారు చేస్తుంది. అదీ మంచి నీటితోనే! బాగా శుద్ధి చేసిన నీటికి కొన్ని పదార్థాలను కలిపి ఈ వైన్ తయారు చేస్తుందిట. దీనికి పెద్ద ఖర్చేమీ ఉండదటండోయ్. కేవలం 2 డాలర్లు... మన కరెన్సీలో రూ.122 రూపాయలతో సరికొత్త తరహా వైన్ బాటిల్ సొంతం చేసుకోవచ్చు. సంప్రదాయ తరహా వైన్ బాటిల్ (20 డాలర్లు) తో పోలిస్తే ఇది ఎంతో చవకే కదూ.
ఇంకా విచిత్రమైన విషయం ఏమిటంటే ఈ యంత్రం బ్లూటూత్ సాయంతో కూడా పనిచేస్తుందట. అందుకు ఓ ప్రత్యేకమైన యాప్ ను కూడా రూపొందించారు. 'ఇక ఈ యంత్రాన్ని సొంతం చేసుకోవాలంటే రూ.30 వేలు మీ వద్ద ఉంటే సరి' అంటున్నారు తయారీదారు బొయాన్సీ వైనరీకి చెందిన కెవిన్ బోయర్.