: సాయం కోసం గంట సేపు అర్ధించినా ఎవరూ రాలేదు: బ్రిటన్ యువతి
ఢిల్లీ నడివీధులలో పారా మెడికల్ విద్యార్థినిని ఆరుగురు కిరాతకంగా హింసిస్తూ అత్యాచారం చేసిన ఘటన తర్వాత అయినా ప్రజలలో మార్పు రాలేదు. కొన్నిరోజుల కిందట బ్రిటన్ దంత వైద్యురాలు డేవిస్(31) ఆగ్రాలోని ఒక హోటల్ లో బస చేసిన సందర్భంగా మాన రక్షణ కోసం హోటల్ రెండో అంతస్తు నుంచి కిందికి దూకిన సంగతి గుర్తుండే ఉంటుంది. బ్రిటన్ కు తిరిగి వెళ్లిన ఆమె.. నాడు జరిగిన సంఘటనను బీబీసీకి వివరించింది.
''ఆ రోజు రాత్రి గంట సేపు సాయం కోసం కేకలు పెట్టాను. ఒక్కరూ రాలేదు. ఉదయాన్నే ఎవరో తలుపు తట్టారు. డోర్ తీసేసరికి హోటల్ మేనేజర్, అతని సహాయకుడు ఉన్నాడు. షవర్ బాత్ కావాలనుకుంటే మస్సాజ్ సేవ అందిస్తామని మేనేజర్ చెప్పాడు. వద్దని చెప్పి వెంటనే తలుపేశాను.
అయినా తలుపులు బద్దలు కొట్టడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. భయం వేసి ఫర్నిచర్ ను తీసుకెళ్లి డోర్ కు అడ్డంగా పెట్టాను. సాయం చేయమని గొంతు పెక్కటిల్లేలా అరిచా. కానీ హోటల్ లో ఒక్కరూ సాయానికి ముందుకు రాలేదు. గంట తర్వాత మరో మార్గం లేక రెండో అంతస్తు నుంచి దూకేశాను'' అని తెలిపింది.

ఈ ఘటనలో ఆమె కాలికి గాయాలైన సంగతి తెలిసిందే. చికిత్స అనంతరం ఆమె బ్రిటన్ వెళ్లిపోయారు. సాక్ష్యం ఇవ్వడానికి రావాలంటూ దర్యాప్తు అధికారులు కోరగా.. మళ్లీ ఒంటరిగా భారత్ లో ఎప్పుడూ అడుగు పెట్టనని బదులిచ్చింది.
- Loading...
More Telugu News
- Loading...