: నేడు ఆర్ఎల్డీలో చేరుతున్న జయప్రద, అమర్ సింగ్


సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఒక పార్టీ నుంచి మరొక పార్టీలోకి నేతల వలసలు పుంజుకుంటున్నాయి. ఈ క్రమంలో ఈ మధ్యాహ్నం తాను రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్ఎల్డీ) లో చేరుతున్నట్లు సమాజ్ వాదీ (ఎస్పీ) మాజీ నేత అమర్ సింగ్ ప్రకటించారు. ఆయనతోపాటే ఆయనకు రాజకీయాల్లో అత్యంత ఆప్తురాలు, సినీనటి జయప్రద కూడా ఆర్ఎల్డీలో చేరుతున్నారు. గతంలో ఎస్పీ నుంచి బహిష్కరణకు గురైన అమర్ కొన్నాళ్లకు 'రాష్ట్రీయ లోక్ మంచ్' పేరుతో సొంత పార్టీని స్థాపించారు. జాతీయ రాజకీయాల్లో ఆ పార్టీ ఆయనకు అంతగా కలసి రాకపోవడంతో ఇప్పుడు వేరొక పార్టీలో చేరుతున్నారు. మరోవైపు లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఆర్ఎల్డీ ఇప్పటికే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని ఉత్తర ప్రదేశ్ లో ఎనిమిది స్థానాల నుంచి పోటీ చేయనుంది.

  • Loading...

More Telugu News