: 50 పైసల కాయిన్ కథ ముగిసినట్లేనా?
పావలా కాయిన్ 2011 జూన్ తో చరిత్రలో కలసిపోయింది. ఇప్పుడు అర్ధరూపాయి నాణెం కథ కూడా కంచికి చేరడానికి సిద్ధంగా ఉంది. అర్ధరూపాయికి వచ్చే వస్తువులు చాలా వరకు లేవు. దాంతో ఈ నాణెం చెల్లనిదైపోయింది. నిజానికి ప్రభుత్వం దీన్ని ఉపసంహరించనంత వరకు అది చెలామణిలో ఉన్నట్లే, దానికి విలువ కూడా ఉన్నట్లే. కానీ, ప్రస్తుతం ఈ నాణేలు ఎక్కడా కనిపించడం లేదు. బిక్షగాళ్లు కూడా 50పైసల నాణెం ఇస్తే తీసుకోని పరిస్థితి ఉంది. ఏదైనా నాణెం ముఖ విలువ కంటే, దాని తయారీకి ఎక్కువ ఖర్చు అయితే ఉపసంహరించడానికి వీలుంటుందని బ్యాంకర్లు చెబుతున్నారు. అర్ధరూపాయి నాణేనికి ఆ పరిస్థితి లేకపోయినా.. చెలామణి లేకపోవడంతో రిజర్వ్ బ్యాంకు ఈ నాణేల ఉత్పత్తిని తగ్గించేసింది. దీంతో సమీప భవిష్యత్తులో ప్రజా జీవితం నుంచి అర్ధరూపాయి కూడా నిష్క్రమించడానికి సిద్ధంగా ఉంది.