: ఆ రెండు పార్టీలతో కలిసేది లేదంటున్న సురవరం
సీపీఐ పార్టీ నేడు తన లోక్ సభ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. మొత్తం 42 మందితో జాబితా విడుదల చేసిన సీపీఐ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో అభ్యర్థులను ప్రకటించలేదు. ఈ సందర్భంగా ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణలో టీఆర్ఎస్, న్యూ డెమోక్రసీ పార్టీలతో పొత్తుపై ఆలోచిస్తున్నామని, సీమాంధ్రలో వైఎస్సార్సీపీ, కిరణ్ పార్టీలతో కలిసే ప్రసక్తేలేదని చెప్పారు.