: రాష్ట్రంలో పలు చోట్ల భారీగా నగదు పట్టివేత
ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో రాష్ట్రంలో తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో నేడు పలు చోట్ల భారీగా డబ్బు పట్టుబడింది. తనిఖీల్లో భాగంగా పోలీసులు నల్గొండ జిల్లాలో రూ.30 లక్షలు, కడప జిల్లాలో రూ.10 లక్షలు, అనంతపురం జిల్లాలో రూ.9 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పలు వాహనాలను సీజ్ చేశారు.