: కోహ్లీ అయ్యెను నెంబర్ వన్
టీమిండియా డాషింగ్ క్రికెటర్ విరాట్ కోహ్లీ వన్డేల్లో నెంబర్ వన్ బ్యాట్స్ మన్ గా అవతరించాడు. ఐసీసీ నేడు విడుదల చేసిన వన్డే బ్యాట్స్ మన్ జాబితాలో కహ్లీ అగ్రస్థానం అలంకరించాడు. ఆసియా కప్ లో విశేషంగా రాణించడం ద్వారా ఈ ఢిల్లీ స్టార్ టాప్ కి ఎగబాకాడు. ఇక ఈ జాబితాలో ఏబీ డివిల్లీర్స్ (దక్షిణాఫ్రికా), జార్జ్ బెయిలీ (ఆస్ట్రేలియా), హషీమ్ ఆమ్లా (దక్షిణాఫ్రికా), సంగక్కర (శ్రీలంక) ఉన్నారు. ఈ జాబితాలో టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఆరోస్థానంలో, ఓపెనర్ శిఖర్ ధావన్ ఎనిమిదో స్థానంలో ఉన్నారు.
ఇక బౌలర్ల జాబితాలో టాప్ టెన్ లో ఉన్న ఏకైక భారత బౌలర్ రవీంద్ర జడేజానే. ఈ సౌరాష్ట్ర కుర్రాడు ఐదో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో పాక్ స్పిన్నర్ సయీద్ అజ్మల్ అగ్రస్థానంలో ఉండగా, డేల్ స్టెయిన్ (దక్షిణాఫ్రికా), సునీల్ నరైన్ (వెస్టిండీస్) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.