: ఏ సంస్థలో పనిచేస్తున్నా, తెలంగాణ జర్నలిస్టులు ఏకతాటిపై నిలిచారు: కిషన్ రెడ్డి


ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం సందర్భంగా తెలంగాణ జర్నలిస్టులు ఏకతాటిపై నిలిచారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కొనియాడారు. వారు ఏ సంస్థలో పనిచేస్తున్నా తెలంగాణ కోసం పోరాటమే తమ విధానమని స్పష్టంగా చాటారని కితాబిచ్చారు. హైదరాబాదులో జరిగిన తెలంగాణ జర్నలిస్టుల ఫోరం సభలో ఆయన మాట్లాడారు. సుదీర్ఘ పోరాటాలు, బలిదానాల అనంతరం తెలంగాణ ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. ప్రజల్లోకి తెలంగాణ భావజాల వ్యాప్తి కోసం జర్నలిస్టులు విశేష కృషి సల్పారని కిషన్ రెడ్డి ప్రశంసించారు. ప్రత్యేక రాష్ట్రంలో ప్రజా ప్రతినిధులుగా తాము తప్పు చేసినా, నిలదీసే హక్కు జర్నలిస్టులకుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News