: త్యాగి లంచం పుచ్చుకున్నది నిజమే!: సీబీఐ నిర్ధారణ
అగస్టా వెస్ట్ ల్యాండ్ హెలికాప్టర్ల సరఫరా ఒప్పందానికి సంబంధించి వాయుసేన మాజీ అధిపతి ఎస్పీ త్యాగి లంచం తీసుకున్నది నిజమేనని సీబీఐ అధికారులు ప్రాథమిక దర్యాప్తు అనంతరం నిర్ధారణకు వచ్చారు. 2004-05 మధ్య కాలంలో మధ్యవర్తి ద్వారా త్యాగికి లంచం సొమ్ము ముట్టిందని, ఆయన సొదరులిద్దరికీ ముడుపులు అందాయని సీబీఐ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి బ్యాంక్ పత్రాలు సహా కీలక ఆధారాలు దర్యాప్తు అధికారులకు లభించాయి.
అయితే త్యాగికి ఎంతమేరకు ముడుపులు ముట్టాయి? అన్నది దర్యాప్తులో తేలాల్సి ఉంది. అగస్టా మాతృ సంస్థ ఫిన్ మెక్కానియా తరఫున మధ్యవర్తి ఒకరు భారత్ కు సొమ్మును తీసుకొచ్చాడని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వాస్తవాలను రాబట్టేందుకు త్వరలో సీబీఐ అధికారులు కొందరిని ప్రశ్నించనున్నారు.