: రాష్ట్రాన్ని గట్టెక్కించేది చంద్రబాబేనంటున్న జేసీ
మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి రాష్ట్ర రాజకీయాలపై స్పందించారు. నేడు అనంతపురం జిల్లా ఉరవకొండలో కాంగ్రెస్ కార్యకర్తలతో సమావేశమైన జేసీ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రాన్ని గట్టెక్కించగలిగే నాయకుడు చంద్రబాబు ఒక్కడే అని కీర్తించారు. ఇటీవలి పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర అభివృద్ధి పాతికేళ్ళు వెనక్కి వెళ్ళిందని పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ పైనా జేసీ విమర్శలు చేశారు. జగన్ తీరు చూస్తుంటే చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకుంటున్నట్టు ఉందని వ్యాఖ్యానించారు.