: గూగుల్ తప్పుచేసినట్లు తేలితే... 500కోట్ల డాలర్ల జరిమానా


భారతీయ మార్కెట్లో పోటీని హరిస్తూ గూగుల్ గుత్తాధిపత్యం చెలాయిస్తోందన్న దానిపై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) విచారణ జరుపుతోంది. దీనిపై రెండేళ్ల క్రితమే సీసీఐ కు ఫిర్యాదు అందగా విచారణ చేపట్టింది. అమెరికాలో ఫెడరల్ ట్రేడ్ కమిషన్ కూడా ఇదే విధమైన ఆరోపణలతో గూగుల్ పై విచారణ జరిపింది. తమ సేవలు వినియోగదారులకు, మార్కెట్లో పోటీకి మేలు చేసేలా ఉన్నాయని ఫెడరల్ ట్రేడ్ కమిషన్ విచారణలో రుజువైందని గూగుల్ ప్రతినిధి తెలిపారు. భారత్ లో సీసీఐకి పూర్తి సహకారం అందిస్తున్నామని చెప్పారు. ఒకవేళ సీసీఐ విచారణలో గూగుల్ చర్యలు పోటీని హరించేలా ఉన్నాయని తేలితే.. గత మూడేళ్లలో సగటున గూగుల్ ఆదాయంలో 10 శాతాన్ని జరిమానాగా విధించే అవకాశం ఉంటుంది. ఈ మొత్తం 500 కోట్ల డాలర్ల (రూ.30 వేల కోట్లు) వరకూ ఉండవచ్చని అంచనా.

  • Loading...

More Telugu News