: స్టూడెంట్ తో పారిపోయిన లేడీ టీచర్ అరెస్ట్
ముంబైకి చెందిన 24 ఏళ్ల ఓ యువ లేడీ టీచర్ 16 ఏళ్ల వయసున్న 9వ తరగతి విద్యార్థితో కలసి పారిపోయింది. చివరికి వీరిని కర్ణాటకలో అరెస్ట్ చేశారు. జనవరి 25న ముంబైకి చెందిన సదరు తొమ్మిదో తరగతి విద్యార్థి డ్రెస్ కొనుక్కుంటానని ఇంటి నుంచి వెళ్లాడు. రాత్రయినా తిరిగి రాకపోవడంతో తండ్రి వకోలా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల విచారణలో ఆశ్చర్యపోయే నిజాలు వెలుగు చూశాయి. ఆ బాలుడు చదివే స్కూల్లో పనిచేస్తున్న 24 ఏళ్ల అంజలి సింగ్ అనే టీచర్ అతడితో కొంత కాలంగా చాలా స్నేహంగా ఉంటున్నట్లు వెల్లడైంది. వాట్స్ యాప్ ద్వారా వారు పలకరించుకోవడం, ఇద్దరూ కలసి బయటకు వెళ్లి రావడం చేస్తున్నారని కూడా తెలిసింది. చిత్రంగా బాలుడు కనిపించకుండా పోయిన జనవరి 25 నుంచే టీచర్ అంజలి సింగ్ కూడా అదృశ్యం కావడంతో వారి అనుమానాలు బలపడ్డాయి. అంజలి, ఆ బాలుడు ఇద్దరూ బెంగళూరులో ఉంటున్నట్లు గుర్తించారు. అక్కడ అంజలి ఓ షాపింగ్ మాల్ లో పనిచేస్తున్నట్లు నిర్ధారించుకున్నారు. వారిని బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేయగా... వారికోసం ముంబై పోలీసులు బెంగళూరుకు వెళ్లారు.