: కిరణ్, పవన్ కల్యాణ్ లకు చంద్రబాబు సలహా!
కొత్తగా పార్టీలు పెట్టేవారికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హితవు పలికారు. కొత్తగా పార్టీలు పెట్టి ఏ పది స్థానాల్లోనో అభ్యర్థులను నిలబెట్టి ఏం సాధిస్తారంటూ బాబు ప్రశ్నించారు. కిరణ్, పవన్ లు కొత్త పార్టీలు పెట్టడం మాని టీడీపీకి మద్దతివ్వాలని సూచించారు. తెలుగుదేశం బలపడితే తెలుగుజాతి బలంగా తయారవుతుందని చెప్పారు. ఇప్పటికే దెబ్బతిన్న తెలుగుజాతి మనోస్థైర్యం తమ చర్యల ద్వారా మరింత దెబ్బతినకుండా చూసుకోవాలని హితవు పలికారు.