: కాంగ్రెస్ తాను తీసుకున్న గోతిలో తానే పడింది: చంద్రబాబు


రాష్ట్రాన్ని ముక్కలు చేసిన కాంగ్రెస్ తాను తీసుకున్న గోతిలో తానే పడిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. మాజీ మంత్రులు టీజీ వెంకటేశ్, ఏరాసు ప్రతాపరెడ్డిలను పార్టీలో చేర్చుకున్న అనంతరం ఆయన మాట్లాడుతూ, వారిద్దరినీ మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని తెలిపారు. టీడీపీని దెబ్బతీసేందుకే రాష్ట్ర విభజన చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ నిర్ణయంతో రెండు ప్రాంతాల ప్రజల మధ్య విద్వేషాలు పెరిగాయని అభిప్రాయపడ్డారు. తానెప్పుడూ రెండు ప్రాంతాలకు అన్యాయం జరగాలని కోరుకోలేదని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీపై చారిత్రక బాధ్యత ఉందని చెప్పారు. తెలంగాణలో భూస్వాములు, పెత్తందార్లు స్వలాభం కోసం ఎదురుచూస్తున్నారని విమర్శించారు.

  • Loading...

More Telugu News