: టీడీపీలో చేరమని సన్నిహితులు ఒత్తిడి చేశారు: ఏరాసు
రాష్ట్ర విభజన అంశంపై తాము కాంగ్రెస్ అధిష్ఠానంపై తీవ్ర పోరాటం చేశామని మాజీ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి చెప్పారు. తమ మాటను పెడచెవినబెట్టి రాష్ట్రాన్ని ముక్కలు చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఓ దశలో రాజకీయాల నుంచి తప్పుకుందామని భావించానని, అయితే, సన్నిహితుల ఒత్తిడి మేరకు టీడీపీలో చేరానని వెల్లడించారు. సీమాంధ్రను స్వర్ణాంధ్రగా మలిచే శక్తి బాబుకుందని, టీడీపీ జాతీయ స్థాయికి ఎదగడం బాబుతోనే సాధ్యమని ఏరాసు స్పష్టం చేశారు.