: ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు అస్వస్థత


కడప జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ కళాశాలలో 150 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. నిన్న రాత్రి చికెన్ బిర్యానీ తదితర వంటకాలను సిబ్బంది వడ్డించారు. వీటిని తిన్న తర్వాత విద్యార్థులకు వాంతులు మొదలయ్యాయి. వెంటనే వారిని వేంపల్లె ఆస్పత్రికి తరలించి చికిత్స ఇప్పించారు. భోజనాల తయారీలో శుభ్రత పాటించకపోవడం వల్లే ఆహారం కలుషితం అయ్యి ఈ పరిస్థితికి కారణమై ఉంటుందని భావిస్తున్నారు. 

  • Loading...

More Telugu News