: మలాలా 24 గంటల మౌన దీక్ష


పాక్ సాహసబాలిక, బాలికల విద్యా హక్కు కోసం పోరాడుతున్న బాల ఉద్యమకారిణి మలాలా యూసఫ్ జాయ్ (16) వచ్చే నెల 17న 24 గంటలపాటు మౌన దీక్ష చేయనున్నట్లు ప్రకటించింది. తమ హక్కుల కోసం గొంతెత్తి ఉద్యమించలేని (మూగవారు) వారికి సంఘీభావంగా ఆమె ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. లండన్ లో మలాలా తన ట్రస్ట్ పరిధిలో జరిగిన ప్రచార కార్యక్రమం ముగింపు సందర్భంగా శుక్రవారం వేలాది మంది విద్యార్థులు, స్కూల్ టీచర్ల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని ప్రకటించింది.

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బాల బాలికలు, యువత ఏప్రిల్ 17న తనతోపాటు మౌనదీక్షలో పాల్గొని చిన్నారుల అభిప్రాయాలను వినాల్సిన అవసరాన్ని ఈ ప్రపంచం గుర్తించేలా చేద్దామని మలాలా పిలుపునిచ్చింది. మన గొంతుకను వినిపించే అవకాశాన్ని చిన్నారుల కోసం వినియోగిద్దామని విజ్ఞప్తి చేసింది. 2012 లో పాక్ లోని స్వాత్ లోయలో తాలిబాన్లు మలాలాపై కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. అనంతరం ఆమెకు బ్రిటన్ వైద్యులు ప్రాణం పోశారు. అప్పటి నుంచి మలాలా బ్రిటన్ లోనే స్థిరపడి బాలికల విద్యా హక్కు కోసం పోరాడుతోంది.

  • Loading...

More Telugu News