: జైరాం రమేశ్ కు సవాల్ విసిరిన పురందేశ్వరి
తాను స్వప్రయోజనాల కోసమే బీజేపీలో చేరినట్టు కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ చేసిన వ్యాఖ్యలను పురందేశ్వరి తప్పుబట్టారు. ప్రకాశం జిల్లా రామాయపట్నంలో తనకు 1000 ఎకరాలు ఉన్నట్టు జైరాం రమేశ్ ఆరోపించడం సరికాదన్నారు. అలాగైతే ఆయన ఆ భూముల సర్వే నెంబర్లు వెల్లడించాలని సవాల్ విసిరారు. తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు రామాయపట్నం, దుగరాజపట్నంలో ఓడరేవులు ఏర్పాటు చేయాలని కోరానని తెలిపారు.
పార్టీకి నష్టం కలిగించే చర్యలకు ఎప్పుడూ పాల్పడలేదని స్ఫష్టీకరించారు. ఇక, తెలంగాణ అంశంలో తమ వాదనలను నిర్లక్ష్యం చేశారన్న బాధతోనే కాంగ్రెస్ పార్టీని వీడానని తెలిపారు. ప్రజాభిప్రాయాన్ని గౌరవించే బీజేపీలో చేరానని స్పష్టం చేశారు.