: తెలంగాణలో పొలిటికల్ గేమ్ షురూ అయిందంటున్న గద్దర్
రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రజాగాయకుడు గద్దర్ మీడియాతో మాట్లాడారు. ఇప్పటిదాకా ఉద్యమం చేస్తే 60 ఏళ్ళ స్వప్నం సాకారమైందని, ఇక తెలంగాణలో రాజకీయ క్రీడ మొదలయ్యిందని అభిప్రాయపడ్డారు. హైదరాబాదులోని ఏవీ కాలేజీలో జరిగిన 'కొత్త రాష్ట్రం సాహిత్య లోకం' సభలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో కళాకారులదే ప్రధాన పాత్ర అని తెలిపారు. రచయితలు ప్రజల కోసం పాటుపడాలని సూచించారు. కాగా, తెలంగాణ రాష్ట్ర సాధనతో అట్టడుగు వర్గాలకు కలిగే ప్రయోజనం ఏమీ లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు.