: పొరుగుదేశాలకు చైనా హెచ్చరిక


'డ్రాగన్' చైనా తన ప్రత్యర్థులకు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది. తమ భూభాగంలోని ప్రతి అంగుళంపైనా తమకు సర్వహక్కులు ఉన్నాయని, ఆ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని పేర్కొంది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి మీడియాతో మాట్లాడుతూ, 'మాది కానిదేదీ మేము తీసుకోం, కానీ, మాకు సంబంధించిన ప్రాంతంలో ప్రతి అంగుళాన్ని కాపాడుకుంటాం' అని పేర్కొన్నారు. చిన్న దేశాలను తామెప్పుడూ బెదిరించలేదని, అలాంటి విధానాన్ని తాము అంగీకరించబోమని వాంగ్ స్పష్టం చేశారు. పొరుగుదేశాలతో సత్సంబంధాలకే తాము ప్రాధాన్యమిస్తామని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News