: విశాఖ నేవీ సెంటర్లో ప్రమాదం, ముగ్గురికి గాయాలు


విశాఖపట్నంలోని నేవీ సెంటర్లోని ఓ భవనంలో ఈరోజు (శనివారం) ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు క్షతగాత్రులయ్యారు. నేవీ సిబ్బంది హైడ్రో ప్రెజర్ పరీక్ష జరుపుతుండగా ఈ ప్రమాదం సంభవించినట్టు సమాచారం అందింది. ఈ ప్రమాద ఘటనలో గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు డాక్టర్లు తెలిపారు.

  • Loading...

More Telugu News