: ఆమ్ ఆద్మీ నేత ముఖానికి ఇంకు పూసిన షాలిమర్ వాసి
ఢిల్లీలో మహిళాదినోత్సవ వేడుకల్లో ప్రసంగిస్తున్న ఆమ్ ఆద్మీ నేత యోగేంద్ర యాదవ్ పై ఓ వ్యక్తి ఇంకు పూశాడు. ఆ సందర్భంలో సదరు వ్యక్తి భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశాడు. మరో ట్విస్ట్ ఏమిటంటే... ఆ వ్యక్తి కూడా ఆమ్ ఆద్మీ టోపీనే ధరించి ఉన్నాడు. అతడిని షాలిమర్ వాసి సాగర్ భండారిగా గుర్తించారు. ఇంకు పూసిన వెంటనే భండారిని ఆప్ కార్యకర్తలు అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు.