: చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు: సీపీ అనురాగ్ శర్మ


మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎవరైనా చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హైదరాబాదు నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ హెచ్చరించారు. హైదరాబాదులో ఈ రోజు (శనివారం) ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఫ్లెక్సీలు, బ్యానర్లు, జెండాలు ఏర్పాటు చేయకూడదని సీపీ తెలిపారు. అభ్యర్థులు పర్యటించే ప్రాంతాల వివరాలను పోలీసులకు ముందుగా తెలిపి అనుమతి తీసుకోవాలని సూచించారు. దేవాలయాలు, ప్రార్థనా మందిరాల సమీపంలో ప్రచారానికి నిషేధాజ్ఞలున్నట్లు ఆయన తెలిపారు. డబ్బు, మద్యం పంపిణీలకు సంబంధించి కఠినంగా వ్యవహరిస్తామన్నారు.

  • Loading...

More Telugu News