: నేడు దక్షిణాఫ్రికాకు వెళుతున్న ప్రధాని


బ్రిక్స్ (BRICS) దేశాల సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మన్మోహన్ సింగ్ ఈ రోజు దక్షిణాఫ్రికాకు బయలుదేరి వెళుతున్నారు. అక్కడి డర్బన్ లో రేపటి నుంచి మొదలుకానున్న 'బ్రిక్స్ డెవలప్ మెంట్ బ్యాంక్' ప్రారంభంలో ఆయన పాల్గొంటారు. బ్రిక్స్ దేశాలు బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా పాల్గొననున్న ఈ  సదస్సు రెండు రోజుల పాటు జరగనుంది.

ఆర్ధిక మంత్రి చిదంబరం, వాణిజ్య మంత్రి ఆనందశర్మ, జాతీయ భద్రత సలహాదారు శివశంకర్ మీనన్, తదితరులు ఈ పర్యటనలో ప్రధానితో పాటు వెళుతున్నారు. కాగా, చైనా నూతన అధ్యక్షుడు జిన్ పింగ్ తో బుధవారం మన్మోహన్ సమావేశమవనున్నారు.

  • Loading...

More Telugu News