: నేనేమీ టెర్రరిస్టును కాదే: కేజ్రివాల్
గుజరాత్ సీఎం నరేంద్ర మోడీ తనకు అపాయింట్ మెంట్ నిరాకరించడంపై ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రివాల్ తీవ్రంగా స్పందించారు. తానేమీ టెర్రరిస్టును కాదని పేర్కొన్నారు. ఓ మాజీ ముఖ్యమంత్రిగా తనకు మోడీని కలిసే అర్హత ఉందని అభిప్రాయపడ్డారు. మోడీ నివాసానికి ఐదు కిలోమీటర్ల ఆవలే తనను నిలువరించడం దారుణమని కేజ్రివాల్ వాపోయారు. గుజరాత్ లో అభివృద్ధి జరిగిందనడం అంతా వట్టిదేనని ఆరోపించారు. మీడియాలో ఓ వర్గం ఆ విధంగా ప్రచారం చేసిందని దుయ్యబట్టారు. గుజరాత్ విషయంలో ప్రచారంలో ఉన్నదానికి, తాను చూసినదానికి పొంతనే లేదని చెప్పుకొచ్చారు. గుజరాత్ లో అవినీతి తాండవమాడుతోందని వ్యాఖ్యానించారు.