: ఇండిగో విమానానికి తప్పిన భారీ ప్రమాదం


ఢిల్లీ నుంచి ఖాట్మండు వచ్చిన ఇండిగో విమానానికి భారీ ప్రమాదం తప్పింది. నేపాల్ రాజధాని ఖాట్మండులోని త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అవుతుండగా.... విమానం (ఎయిర్ బస్ 320) చక్రాలకు మంటలు అంటుకున్నాయి. విమానం ల్యాండ్ అవగానే ప్రయాణికులను హుటాహుటిన దించివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. విమానంలో 170 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రస్తుతం మంటలను అదుపులోకి తీసుకొచ్చామని అధికారులు తెలిపారు. ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై ఏవియేషన్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News