: సమద్రంలో కూలిన విమానంలో ఐదుగురు భారతీయలు
దక్షిణ చైనా సముద్రంలో నిన్న అర్ధరాత్రి కూలిపోయిన మలేసియా ఎయిర్ లైన్స్ విమానంలో ఐదుగురు భారతీయలు కూడా ఉన్నారు. బీజింగ్ కు వెళుతుండగా జరిగిన ఈ ప్రమాదంలో సిబ్బంది సహా విమానంలో ఉన్న 227 మంది దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. వీరిలో 152 మంది చైనీయులు, 38 మంది మలేసియా వాసులు, ఇండోనేసియాకు చెందిన 12 మంది, ఆస్ట్రేలియాకు చెందిన ఆరుగురు ఉన్నారు. మిగిలిన వారు వివిధ దేశాలకు చెందిన వారు.