: మోడీకి మద్దతుగా అమెరికాలో ఆందోళన
గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి వార్టన్ ఇండియా ఎకనమిక్ ఫోరం ఆహ్వానం ఉపసంహరించుకోవటం తాజాగా అమెరికాలో ఆందోళనలకు తావిస్తోంది. ఇందుకు నిరసనగా పెన్సిల్వేనియాలోని వార్టన్ ఇండియా ఎకనమిక్ ఫోరం ఎదుట ప్రవాస భారతీయులు ధర్నా చేశారు. సుమారు రెండువందల మంది భారత సంతతీయులు మోడీకి అనుకూలంగా నినాదాలు చేస్తూ శాంతియుత ర్యాలీ నిర్వహించారు.