: కాంగ్రెస్ మమ్మల్ని గెంటేసింది: గల్లా అరుణ


మాజీ మంత్రి గల్లా అరుణ, ఆమె కుమారుడు గల్లా జయదేవ్ కు చంద్రబాబు పసుపు కండువాలు కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు. తెలుగుదేశంలో చేరిన అనంతరం గల్లా అరుణ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీని తాను వీడలేదని, కాంగ్రెస్ పార్టీయే బయటికి గెంటేసిందని ఆమె చెప్పారు. తమ మనోభావాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం బాధించిందని ఆమె అన్నారు. లోక్ సభలోని ఘటన కలచివేసిందని ఆమె అన్నారు. తనతో పాటు జిల్లాలోని ఎంపీటీసీ, జెడ్పీటీసీ సహా పలువురు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరినట్లు ఆమె ప్రకటించారు.

  • Loading...

More Telugu News