: జిల్లాల పార్టీ అధ్యక్షులతో జగన్ భేటీ
స్థానిక సంస్థల ఎన్నికలకు వైఎస్సార్సీపీ సమాయత్తమవుతోంది. ఈ నేపథ్యంలో జిల్లాల పార్టీ అధ్యక్షులతో ఆ పార్టీ అధినేత జగన్, గౌరవాధ్యక్షురాలు విజయమ్మ భేటీ అయ్యారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు అభ్యర్థులను ఎంపిక చేయడంపై వీరు చర్చిస్తున్నారు. జిల్లాల్లోని వివిధ నేతల మధ్య నెలకొన్న వివాదాలను తొలగించుకోవాలని ఈ సందర్భంగా జగన్ జిల్లా అధ్యక్షులకు సూచించినట్టు తెలుస్తోంది.