: విశ్వవ్యాప్తంగా ఘనంగా ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’
నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని (మార్చి 8) ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా జరుపుకొంటున్నారు. మహిళా ప్రదర్శనలు, ర్యాలీలు, సదస్సులు నిర్వహిస్తున్నారు. న్యూయార్క్ లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం వద్ద భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో యువతులు పెద్ద సంఖ్యలో పాల్గొని మహిళల రక్షణ, హక్కులు తదితర అంశాలపై ప్లకార్డులు ప్రదర్శించారు. ఆడవాళ్లకు సమాన హక్కులు కావాలని నినదించారు.
ఫిలిప్పీన్స్ లో మహిళా దినోత్సవాన భారీ మానవ హారాన్ని రూపొందించారు. 10 వేల మంది మహిళలు సంఘటితమై ర్యాలీగా బయల్దేరి మహిళా శక్తిని చాటారు. అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్న ర్యాలీగా ఈ కార్యక్రమం గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కనుంది.