: మహేష్ బాబు నా తరపున ప్రచారం చేస్తారు: గల్లా జయదేవ్
సినీనటుడు మహేష్ బాబు తన తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటాడని గల్లా జయదేవ్ తెలిపారు. మాజీ మంత్రి గల్లా అరుణ కొడుకు అయిన గల్లా జయదేవ్ టీడీపీ ద్వారా నేడు రాజకీయ ఆరంగేట్రం చేయబోతున్నారు. గల్లా అరుణ కూడా టీడీపీలో చేరడం ఖాయమైంది. ఈ నేపథ్యంలో జయదేవ్ మాట్లాడుతూ.. మహేష్ బాబు ఏ పార్టీకి చెందని వాడని.. తన తరపున ప్రచారం చేస్తాడని చెప్పారు. కాంగ్రెస్ తమను నడిరోడ్డు పాల్జేసిందన్నారు. చంద్రబాబు వల్లే సీమాంధ్ర అభివృద్ధి సాధ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకే టీడీపీలో చేరుతున్నట్లు తెలిపారు.