: మరో మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు
గత కొద్ది రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో జనజీవనం స్థంభించింది. వడగండ్ల దెబ్బకు చేతికొచ్చిన పంట నాశనం కావడంతో రైతులు లబోదిబో మంటున్నారు. అయితే మరో మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాదు వాతావరణ శాఖ ప్రకటించింది. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో వడగళ్లు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి, క్యుములోనింబస్ మేఘాలే ఈ వర్షాలకు కారణమని ప్రకటించింది.