: అసలైన లెజండ్ నందమూరి తారకరామారావే!: 'లెజండ్' ఆడియో వేడుకలో బాలకృష్ణ


సినిమాలో తాను లెజండ్ పాత్ర పోషిస్తున్నప్పటికీ, అసలైన లెజండ్ మాత్రం నందమూరి తారకరామారావు గారేనని హీరో బాలకృష్ణ చెప్పారు.
తెలుగు వారికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు, కీర్తి తీసుకువచ్చిన 'తెలుగు సింహం' రామారావు గారని ఆయన అన్నారు.
ఎటువంటి పాత్ర పోషించాలన్నా అది ఎన్టీఆర్ కే చెల్లిందని ఆయన చెప్పారు.
హైదరాబాదులోని శిల్పకళావేదిక ఆడిటోరియంలో జరిగిన 'లెజండ్' ఆడియో వేడుకలో బాలయ్య ఉద్వేగంతో మాట్లాడారు.
ఇక ఈ 'లెజండ్' సినిమాలో అన్ని రసాలు కలగలసిన పాత్రను తాను పోషించానని బాలకృష్ణ అన్నారు.
"నిన్న రాత్రి ఓ సీన్ కి డబ్బింగ్ చెప్పాను. తెరపై నా పాత్రను చూసి నేనే నమ్మలేకపోయాను.
డబ్బింగ్ చెప్పడం మరచిపోయి అలా చూస్తుండిపోయాను. తర్వాత ఇంటికి వెళ్ళాక కూడా అదే సన్నివేశం గుర్తుకు వచ్చింది. నిద్రపట్టలేదు. అంతలా నా పాత్ర నన్ను వెంటాడింది" అని చెప్పారు బాలకృష్ణ.
ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరినీ పేరు పేరునా ఆయన అభినందించారు. బాలకృష్ణ ప్రసంగిస్తున్నంత సేపు అభిమానులు కరతాళ ధ్వనులతో హర్షాతిరేకాన్ని వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News