: 'లెజెండ్' ఆడియో ఫంక్షన్లో అలీ చమక్కులు
బాలయ్య కొత్త సినిమా లెజెండ్ ఆడియో ఫంక్షన్లో హాస్య నటుడు ఆలీ అందరినీ అలరించారు. వేదికపై ఉన్న యాంకర్ అనసూయతో కలసి ఛలోక్తులతో కార్యక్రమాన్ని పండించారు. ఈ సందర్భంగా, 'చూడు... లెజెండ్ ను చూడు... ఒకవైపే చూడు... రెండోవైపు చూడాలనుకోకు... మాడిపోతావ్' అని సింహా సినిమా డైలాగులతో బాలయ్య అభిమానులను ఉర్రూతలూగించారు. ఇక లెజెండ్ సినిమాలో అలాంటి డైలాగులు బోయపాటి కుప్పలుకుప్పలుగా రాశాడని అలీ పేర్కొన్నారు. కాగా, తాను విఖ్యాత ఎన్టీఆర్ స్పూర్తిగా చిత్రసీమలో అడుగుపెట్టానని, తాను చిన్నప్పటి నుంచే ఆయన అభిమానినని తెలిపారు.