: 'లెజెండ్' వేడుకలో డీ.ఎస్.పీ జోష్ ఆపతరమా...!


ఈ సాయంత్రం పాటల వేడుక జరుపుకుంటున్న బాలకృష్ణ తాజా చిత్రం లెజెండ్ కు దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడన్న సంగతి తెలిసిందే. మామూలుగానే ఆడియో ఫంక్షన్లలో సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలిచే దేవీ... బాలయ్య సినిమా పాటల లాంచింగ్ లో ఎలా సందడి చేస్తాడోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే, బాలకృష్ణ-డీ.ఎస్.పీ కాంబినేషన్లో వస్తున్న మొదటి చిత్రం లెజెండే. దీంతో, మామూలు అభిమానులే కాదు, సినీ వర్గాల చూపూ దేవిశ్రీపైనే ఉంది. ఈ టాలీవుడ్ బ్రహ్మచారి వేదికపైకెక్కాడంటే అటు వాయిద్యాలకు, ఇటు డాన్సర్లకు క్షణం తీరికుండదు. లక్ష వోల్టుల కరెంటుకు మాటలు వస్తే ఎలా ఉంటుందో దేవిశ్రీ లైవ్ అలా ఉంటుందట. ఓ సినీ ప్రముఖుడు చెప్పిన మాట ఇది. కాసేపట్లో లెజెండ్ ఆడియా లైవ్ మొదలవ్వనుంది. మరెందుకాలస్యం, డయాస్ పై డీ.ఎస్. పీ మ్యా(మ్యూ)జికల్ పెర్ఫార్మెన్స్ మనమూ చూసేద్దాం!

  • Loading...

More Telugu News