: పాటల వేడుకకు సిద్ధమైన బాలయ్య 'లెజెండ్'
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న లెజెండ్ చిత్రం ఆడియో ఆవిష్కరణకు రంగం సిద్ధమైంది. హైదరాబాదులోని శిల్పకళా వేదిక ఈ ఆడియో లాంచింగ్ కు వేదిక. ఈ సాయంత్రం ఏడింటికి కార్యక్రమం ఆరంభం అవుతుంది. సింహాతో బ్లాక్ బస్టర్ కొట్టిన బాలయ్య, బోయపాటి జోడీ నుంచి వస్తున్న లెజెండ్ పై భారీ అంచనాలు ఉన్నాయి. వీటన్నింటికి మించి ఈ నందమూరి హీరో సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ మొదటిసారిగా మ్యూజిక్ అందిస్తుండడంతో పాటలపై క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. 14 రీల్స్ ఎంటర్ టెయిన్ మెంట్, వారాహి చలనచిత్రం సంయుక్తంగా రూపొందిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్ టెయినర్ లో బాలయ్య సరసన సోనాల్ చౌహాన్, రాధికా ఆప్టే నటిస్తున్నారు. ఈ చిత్రంలో మరో విశేషం ఏంటంటే, ఇప్పటివరకు ఫ్యామిలీ హీరోగా ముద్రపడిన జగపతి బాబు ప్రతినాయక పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమాకు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మాతలు కాగా సాయి కొర్రపాటి సమర్పకుడు.